← All topic notes

రాజకీయ మరియు రాజ్యాంగ కమిషన్లు: సైమన్, బట్లర్ మరియు ఇతరులు

By exambadi.inNote 04 / 04

పరీక్షల్లో తరచుగా అడిగే రాజకీయ కమిషన్ల ముఖ్యాంశాలు: సైమన్ కమిషన్ (1927) - 1919 చట్టం పనితీరును సమీక్షించడానికి సర్ జాన్ సైమన్ అధ్యక్షతన ఏడుగురు బ్రిటిష్ ఎంపీలతో ఏర్పాటైంది; ఒక్క భారతీయుడు కూడా లేకపోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత (సైమన్ గో బ్యాక్) వ్యక్తమైంది; లాహోర్‌లో లాలా లజపత్‌రాయ్ లాఠీచార్జిలో గాయపడి మరణించారు.

బట్లర్ కమిటీ (1927) - స్వదేశీ సంస్థానాలకు మరియు బ్రిటిష్ ప్రభుత్వానికి (పారామౌంట్‌సీ) మధ్య ఉన్న సంబంధాల పరిశీలనకై ఏర్పడింది. ముద్దిమాన్ కమిటీ (1924) - ప్రావిన్సులలో ద్వంద్వ పాలన లోపాలపై విచారణ జరిపింది.

రాడ్cliff కమిషన్ (1947) - భారత్ మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖలను గీయడానికి సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్ అధ్యక్షతన ఏర్పాటైంది.

Questions for this topic will appear here once published.