← All topic notes

సంగం పరిపాలనా వ్యవస్థ మరియు అధికారులు

By exambadi.inNote 07 / 22

సంగం కాలంలో రాచరిక పాలన కొనసాగింది. రాజు నిరంకుశంగా కాకుండా ధర్మబద్ధంగా ప్రజలను కన్నబిడ్డల వలె పాలించేవాడు.

  • రాజు పదవి మరియు బిరుదులు:
    1. రాజరికం వంశపారంపర్యంగా ఉండేది; పెద్ద కుమారుడు గద్దెనెక్కేవాడు.
    2. రాజును కో, మన్నన్, వేందన్, కొరవన్, ఇరైవన్ అని గౌరవంగా పిలిచేవారు.
    3. రాజ సభను 'అవై' (Avai) అని పిలిచేవారు.
  • ఐదుగురు ముఖ్య మంత్రుల మండలి (పంచ మహాసభ):
    1. రాజుకు పాలనలో సహాయపడటానికి ఐదు రకాల అధికారులు ఉండేవారు:
    2. అమైచ్చార్: మంత్రులు
    3. పురోహితార్: పూజారులు / మత సలహాదారులు
    4. సేనాపతియార్: సైన్యాధ్యక్షులు
    5. దూతార్: రాయబారులు
    6. ఒరార్: గూఢచారులు.
  • రాజ్య పాలనా విభాగాలు:
    1. రాజ్యాన్ని మండలం లేదా నాడు (రాష్ట్రం)గా విభజించారు.
    2. ఊర్ అంటే సాధారణ చిన్న గ్రామం.
    3. పేరూర్ అంటే పెద్ద గ్రామం, సిరూర్ అంటే చిన్న పల్లెటూరు.
    4. పట్టణం అంటే తీరప్రాంత పట్టణం, చేరి అంటే ఊరి శివారు ప్రాంతం.