← All topic notes
భారతదేశ చరిత్ర (Indian History) › ప్రాచీన భారతదేశం (Ancient India) › మలి వేద కాలం - ఆర్యావర్త విస్తరణ మరియు పరిపాలన

రాచరిక అధికారాల పెరుగుదల

Topic 2 of 4 in మలి వేద కాలం - ఆర్యావర్త విస్తరణ మరియు పరిపాలన. Read this note, then practice its questions.

By exambadi.inNote 02 / 04

మలి వేద కాలంలో రాజు అధికారం గణనీయంగా పెరిగి వంశపారంపర్య రాచరికంగా (Hereditary Monarchy) మారింది. రాజులకు దైవాంశ సంభూతత్వాన్ని ఆపాదించే సిద్ధాంతం ఐతరేయ బ్రాహ్మణంలో కనిపించింది.

రాజులు భూభాగ విస్తరణను బట్టి 'రాజన్', 'సమ్రాట్' (తూర్పు), 'స్వరాట్' (పశ్చిమ), 'విరాట్' (ఉత్తర), 'భోజ' (దక్షిణ), 'ఏకరాట్' (ఏకచ్ఛత్రాధిపతి) వంటి ఆడంబరమైన బిరుదులు ధరించారు.

తొలి వేద ప్రజా పరిషత్తులైన సభ, సమితుల ప్రాధాన్యం క్షీణించింది; విదాత పూర్తిగా అంతరించింది.