ఋగ్వేదంలో మొత్తం 33 దేవతలు ఉన్నారని పేర్కొంటూ వారిని మూడు లోకాలకు విభజించారు: 1. అంతరిక్ష లోక దేవతలు: ఇంద్రుడు, రుద్రుడు, వాయువు, మరుత్తులు. 2. భూలోక దేవతలు: అగ్ని, పృథ్వి, సోముడు, బృహస్పతి. 3.
ద్యులోక (స్వర్గ) దేవతలు: వరుణుడు, సూర్యుడు, మిత్రుడు, పూషన్, ఉషస్సు, అదితి. దేవతలలో పురుష దేవతలకే అత్యధిక ప్రాధాన్యం ఉండేది; స్త్రీ దేవతలైన ఉషస్సు, అదితి, సరస్వతి గౌరవించబడ్డారు.
