మధ్యప్రదేశ్‌లోని గుంగేరియాలో అతిపెద్ద రాగి నిల్వలు (Copper Hoards - 424 రాగి వస్తువులు, 102 వెండి రేకులు) లభించాయి. దైమాబాద్‌లో కాంస్య రథం, ఖడ్గమృగం, ఏనుగు బొమ్మలు దొరికాయి.
ఇనామ్‌గావ్‌లో కోటగోడలు, కందకం ఉన్న పెద్ద వ్యవసాయ నివాసం బయల్పడింది. ఓక్రే కలర్డ్ పాటరీ (OCP) గంగా మైదానాల్లోని తామ్రశిలా సంస్కృతికి ప్రతీక. ఈ సంస్కృతులకు కాంస్య మిశ్రమం తయారీ తెలియకపోవడం పరిమితి.
