పోటీ పరీక్షల అభ్యర్థులు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన వాస్తవాలు: 1. BNS, BNSS, BSA చట్టాలు 2024 జూలై 1 నుండి దేశవ్యాప్తంగా అధికారికంగా అమలులోకి వచ్చాయి.
2. 'కమ్యూనిటీ సర్వీస్' (సామాజిక సేవ) ను చిన్న నేరాలకు ఒక శిక్షగా మొదటిసారిగా BNS లో ప్రవేశపెట్టారు. 3. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ నిబంధనలను నోటిఫై చేశారు. 4.
టెలికమ్యూనికేషన్స్ యాక్ట్, 2023 ద్వారా బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ (1885) రద్దు చేయబడింది. 5.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం 2023 ద్వారా ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కేంద్ర కేబినెట్ మంత్రితో కూడిన ఎంపిక కమిటీ ఏర్పాటవుతుంది.
