పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో ఆమోదం పొందిన 'నారీ శక్తి వందన్ అధినియం' భారత రాజ్యాంగ 106వ సవరణ చట్టం, 2023 గా నిలిచింది (బిల్లు సంఖ్య: 128వ రాజ్యాంగ సవరణ బిల్లు).
ఈ చట్టం లోక్‌సభ, ఢిల్లీ అసెంబ్లీ మరియు రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33 శాతం సీట్లను రిజర్వ్ చేయడానికి ఆర్టికల్ 239AA, 330A, 332A మరియు 334A లను రాజ్యాంగంలో చేర్చింది. ఈ రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ వర్గాల మహిళలకు కూడా అంతర్గతంగా వర్తిస్తాయి.
అయితే ఈ చట్టం అమలు నూతన జనగణన (Census) మరియు దాని ఆధారంగా చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) తర్వాత మాత్రమే ప్రారంభమవుతుందని నిబంధన విధించారు. రిజర్వేషన్ల కాలపరిమితి ప్రారంభం నుండి 15 సంవత్సరాలు ఉంటుంది.
